Skip to main content

Posts

Showing posts from January, 2022

Bhasillenu Siluvalo

భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| 1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| 2. పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| 3. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| 4. నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను|| 5. దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| 6. నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||

Enni talachina Adi Adigina

  ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా 1. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| 2. నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| 3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| 4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని

Subhavela Stotra Bali

  శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| 1. ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| 2. ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| 3. యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| 4. యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||