భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
2. పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||
3. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
4. నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
5. దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
6. నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే – నా జయగీతము నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే – నా అతిశయము నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||
Comments
Post a Comment