Skip to main content

Posts

Showing posts from July, 2022

Halleluya Suthi Mahima

  హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 1. అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| 2. ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

Nenu Pilisthe Paruguna Vachastharu

  నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| 1. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| 2. నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| 3. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| 4. నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

Nigamuga Mora Pettina Devudi

  నిజముగా మొర పెట్టిన - దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన - సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| 1. పరలోక తండ్రినడిగిన - మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా - దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| 2. సృష్టి కర్త అయిన ప్రభువుకు - మన అక్కర తెలియకుండునా (2) సరి అయిన సమయానికి - దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| 3. సర్వశక్తుడైన ప్రభువుకు - సాధ్యము కానిదుండునా (2) తన మహిమ కనపరచుటకు - దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||

Sugunala Sampannuda

  సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము (2) సుగుణాల 1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || 3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||

Manche Leni Na Paina

  మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || 2 || ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు || 2 || 1. పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి || 2 || ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా || 2 || 2. లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా 3. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు నీ సాటిలేని త్యాగం – నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా

Yedabayani Nee Krupalo

  ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||

Perma Yessaya Perma

  ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| 1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| 2. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| 3. నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ||

Neeve Krupadharamu Triyeka Deva

  నీవే కృపాదారము త్రియేక దేవా నీవే క్షేమాదారము నా యేసయ్య || 2 నూతన బలమును నవనూతన కృపను || 2 నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || ఆనందించితిని అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలో నేను || 2 ఆకర్షించితిని ఆకాశముకంటే ఉన్నతమైననీ ప్రేమను చూపి || 2 ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి || 2 సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనముకలిగి || 2 శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినెడి పావనమూర్తివి || 2 పరిశుద్దులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి || 2 పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి...

Siluva Chentha Cherina Nadu

  సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి 1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు 2. పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర 2. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె 3. తొంబది తొమ్మిది గొర్రెల విడచి – ఒంటరియైున గొర్రెను వెదకెన్‌ 3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె 4. తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని జేర్చుకొనెను 4. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర 5. పాపుల గతిని పరికించితివా – పాతాళంబే వారి యంతం

Chintha Ledu Ika Yesu Puttenu

  చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) 1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత లేదిక|| 2. చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత లేదిక|| 3. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై ||చింత లేదిక|| 4. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత లేదిక||

Sudha Madhura Kiranala Arunodayam

  సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సహపాలుగా ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా||

Sumadhura Swaramula Ganalatho Vaeladdi

  సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే – నా జయగీతము నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే – నా అతిశయము నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

Nee Dhaya Lo Nenu Vunna Inta Kalamu

  నీ దయలో నేనున్న ఇంత కాలం- నీ కృపలో దాచినావు గత కాలం (2) నీ దయ లేనిదే నేనేమౌదునో (2) తెలియదయ్యా… ||నీ దయలో|| 1. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2) నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| 2. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు (2) నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

Rare Chudamu Raja Suthuni

  రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2) రాజులకు రా రాజు మెస్సియ (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారె|| 1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగెనీ దినమున (2) ||రారె|| 2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2) తెల్లగానది తేజరిల్లెడి (2) తారగాంచరే త్వరగ రారే (2) ||రారె|| 3.బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాల వృద్ధుల (2) నేల గల్గిన నాధుడు (2) ||రారె||

Jeeva nadini naa

  జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

Aparadhni ne yessya

  అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టిl తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2) దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2) అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా (2)