Skip to main content

Aparadhni ne yessya

 అపరాధిని యేసయ్యా

కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టిl
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

Comments

Popular posts from this blog

Sumadhura Swaramula Ganalatho Vaeladdi

  సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే – నా జయగీతము నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే – నా అతిశయము నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

Yehova Naa Balama

 యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం |2| …యెహోవా నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను || 2 || వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 || విడువక నను ఎడబాయని దేవా || 2 || … యెహోవా నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ జేయును || 2 || జలరాసులనుండి బలమైన చేతితో || 2 || వెలుపల జేర్చిన బలమైన దేవుడు || 2 || … యెహోవా మేఘములపై ఆయన వచ్చును - మేఘాలను తన మాటుగ జేయును ||2 || ఉరుములు మెరుపులు మెండుగజేసి || 2 || అపజయమిచ్చును అపవాదికిని || 2 || … యెహోవా దయగల వారిపై దయ జూపించును కఠినుల యెడల వికటము చూపును ||2|| గర్విష్టుల యొక గర్వమును అణచును ||2|| సర్వము నెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||

Yedabayani Nee Krupalo

  ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||