Skip to main content

Neeve Krupadharamu Triyeka Deva

 నీవే కృపాదారము త్రియేక దేవా

నీవే క్షేమాదారము నా యేసయ్య || 2
నూతన బలమును నవనూతన కృపను || 2
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ఆనందించితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైన నీలో నేను || 2
ఆకర్షించితిని ఆకాశముకంటే
ఉన్నతమైననీ ప్రేమను చూపి || 2
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి || 2
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి || 2
శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ప్రాకారములను దాటించితివి
ప్రార్థన వినెడి పావనమూర్తివి || 2
పరిశుద్దులతో నన్ను నిలిపితివి
నీ కార్యములను నూతన పరచి || 2
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము

Comments

Popular posts from this blog

Sumadhura Swaramula Ganalatho Vaeladdi

  సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే – నా జయగీతము నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే – నా అతిశయము నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

Yehova Naa Balama

 యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం |2| …యెహోవా నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను || 2 || వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 || విడువక నను ఎడబాయని దేవా || 2 || … యెహోవా నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ జేయును || 2 || జలరాసులనుండి బలమైన చేతితో || 2 || వెలుపల జేర్చిన బలమైన దేవుడు || 2 || … యెహోవా మేఘములపై ఆయన వచ్చును - మేఘాలను తన మాటుగ జేయును ||2 || ఉరుములు మెరుపులు మెండుగజేసి || 2 || అపజయమిచ్చును అపవాదికిని || 2 || … యెహోవా దయగల వారిపై దయ జూపించును కఠినుల యెడల వికటము చూపును ||2|| గర్విష్టుల యొక గర్వమును అణచును ||2|| సర్వము నెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||

Yedabayani Nee Krupalo

  ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||