సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము (2) సుగుణాల1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే.
నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
Comments
Post a Comment