Skip to main content

Posts

Showing posts from November, 2022

Yehova Naa Balama

 యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం |2| …యెహోవా నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను || 2 || వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 || విడువక నను ఎడబాయని దేవా || 2 || … యెహోవా నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ జేయును || 2 || జలరాసులనుండి బలమైన చేతితో || 2 || వెలుపల జేర్చిన బలమైన దేవుడు || 2 || … యెహోవా మేఘములపై ఆయన వచ్చును - మేఘాలను తన మాటుగ జేయును ||2 || ఉరుములు మెరుపులు మెండుగజేసి || 2 || అపజయమిచ్చును అపవాదికిని || 2 || … యెహోవా దయగల వారిపై దయ జూపించును కఠినుల యెడల వికటము చూపును ||2|| గర్విష్టుల యొక గర్వమును అణచును ||2|| సర్వము నెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||