యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం |2| …యెహోవా
నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను || 2 ||
వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 ||
విడువక నను ఎడబాయని దేవా || 2 || … యెహోవా
నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ జేయును || 2 ||
జలరాసులనుండి బలమైన చేతితో || 2 ||
వెలుపల జేర్చిన బలమైన దేవుడు || 2 || … యెహోవా
మేఘములపై ఆయన వచ్చును - మేఘాలను తన మాటుగ జేయును ||2 ||
ఉరుములు మెరుపులు మెండుగజేసి || 2 ||
అపజయమిచ్చును అపవాదికిని || 2 || … యెహోవా
దయగల వారిపై దయ జూపించును కఠినుల యెడల వికటము చూపును ||2||
గర్విష్టుల యొక గర్వమును అణచును ||2||
సర్వము నెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||
Comments
Post a Comment