యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా
యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా మహిమా గల శుద్ధాత్మ యిట్టి - వరుస దెలిపెం గద మాతోడ 1. మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు - లక్షపెట్ట మిహ బాధలకు 2. అబ్రహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ మా చుట్టా లైనన్ - హర్షమిక మా కేమి కొదువ 3. పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కుటస్తుల్ ఖ్యాతి సభలో మే మున్నపుడు - ఘనతలిక మాకేమి వెలితి 4. తనువు బలిపెట్టెను మా యన్న- తప్పు ల్విడగొట్టెను మాతండ్రి మనసులో సాక్షమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి 5. పరమ విభు జీవ గ్రంధములో - బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు - చెరుపు బెట్టెడువా రింకెవ్వరు 6. కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు - సరుకు గోన మిక్కిడి లేములకుSong Explanation 1.30 start
Comments
Post a Comment