మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || 2 ||
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు || 2 ||1. పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి || 2 ||
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా || 2 ||
2. లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు
నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా
3. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు
నీ సాటిలేని త్యాగం – నా పాలి గొప్ప భాగ్యం
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా
Comments
Post a Comment