నిజముగా మొర పెట్టిన - దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన - సమాధానమీయకుండునాజీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||
1. పరలోక తండ్రినడిగిన - మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించినా - దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల||
2. సృష్టి కర్త అయిన ప్రభువుకు - మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి - దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల||
3. సర్వశక్తుడైన ప్రభువుకు - సాధ్యము కానిదుండునా (2)
తన మహిమ కనపరచుటకు - దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||
Comments
Post a Comment